calender_icon.png 26 January, 2026 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైకును ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

26-01-2026 09:06:52 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): బైకును ఢీకొట్టిన కారు ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన బంజర తండ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... నాగిరెడ్డిపేట్ మండలంలోని బంజర తండ సమీపంలో ఇద్దరు వ్యక్తులను ఎల్లారెడ్డి వైపు నుండి మెదక్ వైపు వెళ్తున్నటువంటి ఎరుపు రంగు కారు ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిందని ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు.

ప్రమాదంలో ఒక వ్యక్తికి కాలు విరుగగా మరో వ్యక్తికి తనకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందగానే వెంటనే పోలీస్ సిబ్బంది గ్రామస్తుల సహాయంతో గాయపడిన వ్యక్తులను స్థానిక జిఎస్ఎం ఆసుపత్రికి తరలించగా అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం మెదక్ షిఫ్ట్ చేయడం జరిగిందని ఎస్ఐ భార్గవ్ గౌడ్ పేర్కొన్నారు.అయితే గాయపడిన వ్యక్తులు బంజర తండ గ్రామానికి చెందిన సాతెలి బాల్రాజ్, ఇక్కలదేవ్ అరవిందులని ఎస్ఐ.భార్గవ్ గౌడ్ తెలిపారు.