calender_icon.png 10 October, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంజారాహిల్స్‌లో హైడ్రా కూల్చివేతలు

10-10-2025 10:29:21 AM

బంజారాహిల్స్ లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా

5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్న హైడ్రా.

రూ. 750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.

హైదరాబాద్: బంజారాహిల్స్(Banjara Hills) రోడ్ నంబర్ 10లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి(Basavatarakam Cancer Hospital) సమీపంలో ఐదుఎకరాల సర్కార్ స్థలం ఆక్రమణకు గురైంది. ఐదెకరాలు ప్రభుత్వ భూమిని హైడ్రా(Hyderabad Disaster Response and Asset Protection Agency) స్వాధీనం చేసుకుంది. రూ. 750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడి ప్రభుత్వానికి అప్పగించింది. తెలంగాణ ప్రభుత్వం ఐదెకరాల్లో జలమండలికి 1.20 ఎకరాలు కేటాయించింది. 1.20 ఎకరాలతో పాటు మొత్తం ఐదెకరాలు తనదేనంటూ పార్థసారథి కోర్టుకెక్కారు. చుట్టూ ఫెన్సింగ్ వేసిన పార్థసారథి బౌన్సర్లతో పాటు వేటకుక్కలతో కాపలా పెట్టారు. కోర్టులో వివాదం ఉండగా ఐదెకరాలు అధీనంలోకి తీసుకుని షెడ్డులు వేసి పహారా కాస్తున్నాడు. దీంతో జలమండలి, రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ భూమిలో అడ్డా వేసుకుని భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రిజర్వాయర్ నిర్మించాలన్న జలమండలి ప్రయత్నాలను పార్థసారథి అడ్డుకున్నారు. నకిలీ సర్వే నంబర్ 403/52తో భూమి కాజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రెవెన్యూ, జల మండలి అధికారులు పార్థసారథిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో 4 క్రిమినల్ కేసులో పెట్టారు. వాస్తవానికి 403 సర్వే నంబర్ లో ఉన్నది ప్రభుత్వ భూమి. సర్వే నంబర్ లో బై నంబర్ వేసి పార్థసారథి భూమికి ఆక్రమించినట్లు నిర్ధారణ అయింది. అన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ తో పార్థసారథి ప్రభుత్వ భూమి క్లెయిమ్ చేసుకున్నట్లు నిర్ధారించారు. షేక్ పేట్ రెవెన్యూ సిబ్బంది లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య హైడ్రా ఆక్రమణలను తొలగించింది. పార్థసారథి వేసిన ఫెన్సింగ్ తో పాటు లోప ఉన్న షెడ్డులను హైడ్రా నేలమట్టం చేసింది. అనంతరం ఐదెకరాలు చుట్టూ ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమిగా హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.