10-10-2025 10:30:49 AM
గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని వీరన్నగూడెం చెందిన మడుపతి వీరేషం, శివనాగులు, శంకరప్ప, గణేష్ వారి మాతృమూర్తి రాజమణి రాత్రి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మరణించిన వారి కుటుంబాన్ని పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. వీరితోపాటు మాజీ జడ్పిటిసి కుమార్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి నాగేందర్ గౌడ్, సంజీవరెడ్డి,శంకర్,గోపాల్, శంకర్ యాదవ్,ఆంజనేయులు,వినోద్, పాల్గొన్నారు.