calender_icon.png 17 May, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు

16-05-2025 10:08:14 PM

ఇద్దరికీ తీవ్ర గాయాలు

కొండపాక,(విజయక్రాంతి): కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులో రాజీవ్ రహదారిపై మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట పట్టణానికి చెందిన కనకాచారి రత్నమాల భార్యాభర్తలు కలిసి ద్విచక్ర వాహనంపై చేర్యాలకు బంధువుల పెళ్లి లో పాల్గొనడానికి వెళుతుండగా వీరి ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపున కారు ఢీ కొట్టి ఆపకుండా వెళ్ళిపోయింది. దాంతో వారిద్దరు కింద పడిపోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది మహేందర్, శ్రీనివాస్ లు చేరుకొని వారికి ప్రథమ చికిత్స చేసి అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చేర్పించారు. కాగా కనకాచారికి చేయి విరగగా రత్నమాలకు కాలు విరిగింది.