calender_icon.png 23 August, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళాకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

16-05-2025 10:04:21 PM

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

 హనుమకొండ,(విజయక్రాంతి): కళాకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం హనుమకొండ, రామ్ నగర్ లోని మంత్రి నివాసంలో తెలంగాణ రాష్ట్ర చిందు యక్షగాన వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజవెల్లి సారయ్యతోపాటు కళాకారులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సత్కరించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని చిందు యక్షగాన కళాకారులు నాటకాలను ప్రదర్శించేందు కోసం 45 బృందాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. నెలకు ఒక బృందం చొప్పున నాటకాలను ప్రదర్శించి ప్రభుత్వం ద్వారా లభించే పారితోషికంతో ఉపాధి పొందాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో చిందు యక్షగాన కళాకారుల సంఘం నేతలు గజవెల్లి ఈశ్వర్, గడ్డం చిరంజీవి, చంద్రయ్య, కిష్టయ్య, లింగమూర్తి, జంగయ్య తదితరులు ఉన్నారు.