2 May, 2026 | 7:24 PM

Breaking News

డి.ఎస్.పి మహేందర్ రెడ్డికి ఎస్పీ అభినందనలు   •   రఘునాథ బంజరలో కొత్తగా మట్టి రోడ్డు ఏర్పాటు   •   ప్రజా పాలనతో దేశంలో ముందంజలో తెలంగాణ   •   అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి   •   మహిళాల భద్రతపై అవగాహన కల్పించిన షీ టీం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •  

పదే పదే ప్రాణం నిన్నే కోరగా..

14-03-2026 01:16 AM

‘పదే పదే ప్రాణం నిన్నే కోరగా.. కలే నిజం కాదా నిన్ను చేరగా.. ఒకే ఒక ఆశ చాలుగా నువ్వే చాలుగా.. ప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ’.. అంటూ అమ్మాయి తన మనసులోని ప్రేమను అబ్బాయికి చెప్పటానికి ఎంతో ఆశతో, ఆతృతగా ఎదురుచూస్తోంది.

ఇంతకీ అమ్మాయి మనసులో ప్రేమను సంపాదించుకున్న అబ్బాయి కథేంటో తెలుసుకోవాలంటే ‘రాకాస’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై టాలీవుడ్ నటి, నిర్మాత నిహారిక కొణిదెల నిర్మించారు. జీ స్టూడియోస్ నిర్మాత ఉమేశ్ కుమార్ బన్సాల్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణమ్మ, జబర్దస్త్ రోహిణి, ‘నైంటీస్’ రోహన్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ప్రమోషనల్ సాంగ్ విడుదలయ్యాయి. తాజాగా ‘పదే పదే’ అనే మెలోడీ గీతాన్ని చిత్రబృందం రిలీజ్ చేసింది. అనుదీప్ దేవ్ అందించిన బాణీ, కిట్టు విస్సాప్రగడ సాహిత్యం, సింధూజ శ్రీనివాసన్ గాత్రం ఈ పాటను ప్రత్యేకంగా మార్చేశాయి. ఈ చిత్రానికి రాజు ఎదురోలు సినిమాటోగ్రఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా పనిచేశారు.