24 August, 2026 | 2:42 PM

నమ్మించి రెండు తులాల గొలుసు అపహరణ

18-06-2025 12:00 AM

భైంసా, జూన్ 17 (విజయక్రాంతి): భైం సా పట్టణంలో గుర్తు తెలియని దుండగులు మంగళవారం పోలీసులమని చెప్పి రెండు తులాల గొలుసులు అపహరించినట్టు బాధితురాలు రాజవ్వ తెలిపారు. పట్టణంలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి భర్త గోవింద్ తో కలిసి వెళుతుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తాము పోలీసులమని మహిళకు తెలిపారు.

ఇప్పుడే ఇక్కడ మహిళా మెడల నుంచి బంగారం గొలుసు తెంపుకొని పోయారని మీ మెడలో ఉన్న గొలుసు తీసి లోపల పెట్టుకోవాలని సలహా ఇచ్చారు దీంతో ఆమె గొలుసును తీసి పొట్లం కడుతుండగా దాన్ని బలవంతంగా లాక్కొని పారిపోవడంతో వారు లబోదిబోమన్నారు.

పోలీసులకు సమాచారం ఇవ్వడం తో ఏఎస్‌ఐ దేవి రావు సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి విచారణ జరుపుకున్నారు. బాధితురాలు రాజవ్వ కుంటాల మండలంలోని అంబకటి గ్రామానికి చెందిన మహిళ గా పోలీసులు తెలిపారు.