25-04-2025 02:02:40 AM
సూర్యాపేట, ఏప్రిల్ 24: సూర్యాపేటలో పుట్ట గొడుగుల మాదిరి అర్హతలేని వైద్యులు రోజురోజుకూ పుట్టుకొస్తున్నారు. జిల్లా నలమూలల నుంచి అమాయక ప్రజలు ఇక్కడి వైద్యులను నమ్ముకుని వారి ప్రాణాలను పణంగా పెడుతున్నారు. జిల్లా కేంద్రాన్ని అనుకుని జిల్లా పాలనాధికారి, ఆయా శాఖల జిల్లా అధికారులు ఇక్కడే ఉండి విధులు నిర్వహిస్తున్న, ఎవరు మనల్ని ప్రశ్నించేది, అడిగేది అన్నట్లు నకిలీ వైద్యులు అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
ఇంతా జరుగుతున్నా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారికి ఏమి పట్టున్నట్లు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోం ది. గురువారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి, ఇందులో భాగంగా గత పదేళ్ళకు పైగా అర్హత లేకున్నా యాపిల్ స్కానింగ్ సెంటర్ లో పని చేస్తున్న నకిలీ రేడియాలజిస్టు ను గుర్తించినట్లు సమాచారం,
అలాగే సాయి గణేష్ ఆసుపత్రిలో సర్టిఫికేట్ గడువు ముగిసి రెండేళ్లు గడిచిన కూడా పట్టించుకోని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోనట్లు తెలుస్తుంది, చైనా ఎంబీబీఎస్ తో అరేండ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న మరో వైద్యుడు బాగోతం బయటపడినట్లు తెలుస్తుంది. ఇంకా వైద్య విధాన మండలి సభ్యుల తనిఖీ తో సూర్యాపేట డిఎంహెచ్‌ఓ ఏం జవాబు ఇస్తారో వేచి చూడాలి.