25-04-2025 02:00:09 AM
కోదాడ ఏప్రిల్ 24{ జమ్ము కాశ్మీర్ లోని పహాల్గంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కోదాడ నాయకులు డిమాండ్ చేశారు. గుడిబండ రోడ్డులో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, జమ్ము కాశ్మీర్ ఉగ్రదాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని తెలిపారు.
ఈ దాడిలో 26 మంది చనిపోయారని, ఉగ్రవాదులు అత్యం త కిరాతకంగా అమాయకులను పొట్టన పెట్టుకున్నారని తెలిపారు. వెంటనే ఉగ్రవా దులను ఉరిశిక్ష విధించాలని వారు డిమాం డ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తూమాటి నాగిరెడ్డి, బీజేపీ నాయకులు రాధ కృష్ణ, ఓరుగంటి రామకృష్ణ రెడ్డి, పులి తిరుపతి బాబు, వెంకటేష్ రెడ్డి, వెంకీ, వీర నాగు, సతీష్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి, నాగేంద్ర బాబు , కేసు బాబు, రమేష్, శ్రీను, నర్సియ్య, బాబు, దిలీప్, రవీందర్, రోషయ్య తదితరులు పాల్గొన్నారు.