calender_icon.png 4 August, 2025 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనరహిత పాదయాత్ర

04-08-2025 01:25:34 AM

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి 

హైదరాబాద్, ఆగష్టు 03 (విజయక్రాంతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు లక్షలమందికి రుణమాఫీ కాలేదని, తాను అడిగిన ప్రశ్నలకు మీనాక్షి నటరాజన్ సిద్దులగుట్ట ఎక్కి సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోమాలోకి పోయిందని, రైతు డిక్లరేషన్‌కు ఉప్పుపాతర వేశారన్నారు. జనహిత పాదయాత్ర కాదని, జనరహిత పాదయాత్ర అన్నారు.

ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్‌లో కాంగ్రెస్ పాదయాత్రకు ప్రజలు రాలేదన్నారు. డమ్మీ సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ఉన్నారని, షాడో సీఎం రాష్ర్టంలో పాదయాత్ర చేస్తున్నారన్నారు. ఆర్మూర్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ కనిపిస్తుందని, తనపై 40 కేసులు పెట్టారన్నారు.