calender_icon.png 4 August, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనులు నిలిపివేసిన అధికారులు

04-08-2025 01:26:28 AM

ప్రభుత్వ స్థలమంటూ వాల్ రైటింగ్ 

రామకృష్ణాపూర్, ఆగస్టు 3: ‘రామకృష్ణాపూర్ పట్టణంలో ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాలు’ శీర్షికన విజయక్రాంతి పత్రికలో ప్రచురితమైన కథనానికి మందమర్రి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఆదివారం తహసీల్దార్ సతీష్ సిబ్బందితో కలిసి పట్టణంలోని శివాజీ నగర్ ఏరియా రైల్వే గోడకు అనుకుని ఉన్న సర్వే నెంబర్ 7లో కబ్జాకు గురైన ప్రాంతానికి వెళ్లారు.

అక్కడ చేపడుతున్న పనులను అడ్డుకున్నారు. అనంతరం ఆ స్థలంలో ఏర్పాటు చేసిన పిల్లర్లపై ప్రభుత్వ స్థలంగా పెయింటింగ్‌తో వాల్ రైటింగ్ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సతీష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.