17-11-2025 01:07:50 PM
బీజేపీ నాయకులు డిమాండ్
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): వేములవాడ అర్బన్ మండలం మిడ్ మానేరు జలాశయం బ్యాక్ వాటర్ పెరగడంతో పంట పొలాల్లో నీరు చేరి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ అర్బన్ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్ అన్నారు. సోమవారం సంకేపల్లి, ఆరేపల్లి లో నీట మునిగిన పత్తి వరి పంటలను వారు సందర్శించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ముంపు గ్రామాల సమస్యలు త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.. వారి వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రం మహేశ్ బిజెపి నాయకులు ఉన్నారు. అర్బన్ మండల బీజేపీ నేతలు ఉన్నారు.