17-11-2025 01:46:41 AM
శంకర్ పల్లి, నవంబర్ 16: శంకర్ పల్లి మండల పరిధిలోని మోకిల తాండ గ్రామంలో శంకర్ పల్లి లలిత హాస్పిటల్ వారు, గ్రామ యువ నాయకుడు వర్త్య బాబు నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. మండల పరిధిలోని మోకిలా తాండలో ఆదివారం నాడు వర్త్య బాబు నాయక్ ఆధ్వర్యంలోలలిత హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం ఏర్పరిచాడు. ఈ సందర్భంగా బాబు నాయక్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు అని అన్నారు.
ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకసారి వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. అందులో భాగంగానే ఆదివారం శంకర్ పల్లి లలిత హాస్పిటల్ తమ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించాలని,తెలపగ స్వచ్ఛందంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారని తెలిపారు.అందులో భాగంగా గ్రామస్తులు 102 మందికి గ్రామ ప్రజలకు వైద్యం అందించారని తెలిపారు.
ఈ ఉచిత వైద్య శిబిరంలో కాళ్ల నొప్పులు, వివిధ రక్త పరీక్షలు, మరియు బిపి మొదలగు పరీక్షలు ఉచితంగా వైద్యం చేయించుకున్నారు. రోగులకు మందు గోలీలు కూడా ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో లలిత హాస్పిటల్ డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ వినోద్, ప్రశాంత్, హాస్పిటల్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా మోకలతాండకు విచ్చేసి ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన లలిత హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.