calender_icon.png 17 November, 2025 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

17వ రోజున ఆంధ్ర–కర్ణాటక సరిహద్దు చేరిన శభరి గిరిష పాదయాత్ర

17-11-2025 01:11:05 PM

శ్రీ శభరి గిరిష మహా పాదయాత్ర 17వ రోజున ఆంధ్ర–కర్నాటక సరిహద్దు చేరుకున్న అయ్యప్ప స్వాములు

సనత్‌నగర్,(విజయక్రాంతి): శబరిమల యాత్ర సీజన్ సందర్భంగా బేగంపేట్ ప్రాంతంలో నవంబర్ 1న బేగంపేట్ హనుమాన్ మందిరం నుండి శ్రీ శభరి గిరిష మహా పాదయాత్ర సేవా సమితి స్వాములు భక్తి–భావాలతో పాదయాత్రను ప్రారంబించారు. కీ.శే. శ్రీ వేణుగోపాల్ గురుస్వామి ఆశీసులను స్మరించుకుంటూ అనుభవ గురుస్వాముల మార్గదర్శకత్వంలో “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో ఈ పాదయాత్ర మొదలైంది. ప్రారంభ వేళ స్థానిక భక్తులు స్వాములకు హారతులు ఇస్తూ ఘనంగా సాగనంపారు.

నేటితో 17 రోజులు పూర్తి చేసుకున్న ఈ పాదయాత్ర ఆంధ్ర–కర్నాటక సరిహద్దు ప్రాంతానికి చేరుకోగా అక్కడ భక్తి తరంగాలు అలుముకున్నాయి. సోమవారం నవంబర్ 17 ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించబడగా, యాత్రలో పాల్గొంటున్న స్వాముల ఆరోగ్య–క్షేమాలు, ప్రయాణం విజయవంతంగా సాగాలని గురుస్వాములు ప్రార్థనలు చేశారు. సరిహద్దు ప్రాంతమంతా “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో ఆధ్యాత్మికత నిండిపోయింది.పూజా కార్యక్రమం అనంతరం స్వాములు సంప్రదాయంగా మగ్గు వేయడం ద్వారా కార్యక్రమాన్ని ముగించారు.

స్వాములకు ఆహార ప్రసాదం, సేవా కార్యక్రమాలను శ్రీ శభరి గిరిష మహా పాదయాత్ర సేవా సమితి గురుస్వాములు శ్రద్ధగా నిర్వహించారు.కార్యక్రమంలో సోములు యాదవ్ గురుస్వామి, బుచిబాబు గురుస్వామి, బాలూ యాదవ్ గురుస్వామి, నాగరాజు గురుస్వామి, బాబులు గౌడ్ గురుస్వామి, పవన్ స్వామి, నాగరాజు ముదిరాజ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.నవంబర్ 1న బేగంపేట్ హనుమాన్ మందిరం నుంచి ప్రారంభమైన ఈ 17 రోజుల పాదయాత్ర, అయ్యప్ప భక్తుల ఐక్యత, సేవాభావం, ఆధ్యాత్మిక శ్రద్ధలకు ప్రతీకగా నిలిచింది.