బీజేపీ నేత మాసం గణేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కేంద్రమంత్రి బండి సంజయ్
కొత్తపల్లి: కరీంనగర్ పట్టణం తొమ్మిదవ డివిజన్ బీజేపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్, ఈస్ట్ జోన్ ప్రధాన కార్యదర్శి మాసం గణేష్ మాతృమూర్తి మాసం కమల రెండు రోజుల క్రితం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. మరణ వార్త తెలుసుకొని సోమవారం రోజున కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar), మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, రాపర్తి ప్రసాద్, కొట్టే మురళీకృష్ణ, కోడూరి మహేందర్ గౌడ్, బీజేపీ నాయకులు మాసం గణేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కీ. శే. మాసం కమల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులందరూ మనోధైర్యంతో ఉండాలని, వారందరినీ ఓదార్చారు.






