03-12-2025 05:08:10 PM
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే హిల్ట్ పాలసీ(HILT Policy)ని తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. పారిశ్రామికవాడలో పని చేస్తున్న వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని, రైతులకు సహకారం అందించకుండా రియల్టర్లు, పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకే హిల్ట్ పాలసీని తీసుకువచ్చారని కేంద్రమంత్రి తెలిపారు.
గతంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా ఇలాగే వ్యవహరించారని, పారిశ్రామిక వేత్తలకు ఒక విధానం.. రైతులకు ఒక విధానమా..? అని ప్రశ్నించారు. పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూర్చేలా అవినీతి జీవోను తెచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల ఎకరాల్లో కమర్షియల్ కాంప్లెక్సులకు అనుమతి ఇస్తే ట్రాఫిక్ పరిస్థితి ఏంటి..? అని కిషన్ రెడ్డి అడిగారు.