calender_icon.png 6 September, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సంక్షేమానికి యూనియన్ కృషి

06-09-2025 12:00:00 AM

ఘట్ కేసర్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : జర్నలిస్టుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి యూనియన్ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని టీయూడబ్ల్యూజే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు జి. బాల్ రాజ్, ప్రధాన కార్యదర్శి జి. వెంకట్ రాంరెడ్డిలు అన్నారు. ఘట్ కేసర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన టీయూడబ్ల్యూజే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు 16 మంది పూర్తి చేసిన సభ్యత్వ నమోదు ఫారంలను వారు స్వీకరించారు.

యూనియన్ లో సభ్యత్వ నమోదు చేసుకున్న సభ్యులకు ఐడి కార్డు, జిల్లా డైరీ,  భావస్వేచ్చ మాసపత్రిక అందజేయడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన పాత్రికేయులకు అక్రిడియేషన్ కార్డు, అవకాశం ఉన్న చోట్ల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి కోరనున్నట్లు వారు చెప్పారు.

కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి వేములగోవింద్ రాజ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండకళ్ళ నర్సింహ్మ, మాజీ అధ్యక్షులు లింగాల భూపాల్, మాజీ ప్రధాన కార్యదర్శి కేతం రమేశ్, ఉపాధ్యక్షులు నామాల శ్రీనివాస్, కోశాధికారి లంబ రాజు, సంయుక్త కార్యదర్శి సల్లూరి నర్సింగ్ రావు, మాజీ సలహాదారు కుంటోళ్ల యాదగిరి పాల్గొన్నారు.