calender_icon.png 6 September, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం పడిగాపులు

06-09-2025 12:00:00 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), సెప్టెంబర్ 5: రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి.తిండి తిప్పలు, నిద్రాహారాలు మాని రాత్రి, పగలు అన్న తేడా లేకుండా అన్నదాతలు యూరియా కోసం రోజు పడిగాపులు కాస్తూనే ఉన్నారు.  మండలంలోని తిమ్మాపురం పీఏసీఎస్ కు శుక్రవారం ఉదయం 270 బస్తాల యూరియా వచ్చింది. విషయం తెలి సి రైతులు యూరియా కోసం సింగి ల్ విండో కార్యాలయానికి వచ్చి క్యూలో ఉన్నారు.

క్యూలో ఉన్న రైతు ల మధ్య తోపులాట జరగడంతో వారిని అదుపు చేయడం కష్టతరంగా మారింది.వెంటనే స్థానిక ఎస్త్స్ర ఈట సైదులు తన సిబ్బందితో పీఏసీఎస్ కేంద్రానికి చేరుకొని పీఏసీఎస్ చైర్మన్, సీఈఓ సహకారంతో రైతులను క్యూలో నిలబెట్టి సీరియల్ ప్రకారం 270మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా చొప్పున పంపిణీ చేశారు.

సిరికొండ గ్రామంలో ..

మోతే, సెప్టెంబర్ 5: శుక్రవారం మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో సహకార సంఘం సొసైటీలో తెల్లవారుజాము నుండి రైతులు యూరియా కోసం తిండి తిప్పలు, నిద్రాహారాలు మాని రాత్రి, పగలు అన్న తేడా లేకుండా యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడి  తిప్పలు పడుతూనే ఉన్నా రు. అయినా ఒక్క బస్తా యూరియా కూడా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండల పరిధిలోని సిరికొండ సహకార సంఘం సొసైటీలో శుక్రవారం ఉదయం 499 బస్తాల యూరియా వచ్చిందని, విషయం తెలుసుకున్న సమీప గ్రామాల రైతులు యూరి యా కోసం సహకార సంఘం సొసైటీలో క్యూలో ఉన్నారు.

క్యూలో ఉన్న రైతుల మధ్య తోపులాట జరగడంతో వారిని అదుపు చేయడం కష్టతరంగా మారింది. వెంటనే  ఎస్త్స్ర అజయ్ కుమార్ తన సిబ్బందితో సహకార సంఘం సొసైటీ కి చేరుకొని సింగిల్ విండో చైర్మన్, సీఈవో సహకారంతో  రైతులను క్యూలో నిలబెట్టి సీరియల్ ప్రకారం 499 మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా చొప్పున పంపిణీ చేశారు.