08-11-2025 12:00:00 AM
నకిరేకల్ నవంబర్ 7 (విజయక్రాంతి) : ఆశా వర్కర్ల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ చెరుకు జానకి, జిల్లా కమిటీ సభ్యురాలు భూపతి రేణుకపిలుపునిచ్చారు.నవంబర్ 6న నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవనంలో జరిగిన యూనియన్ 5వ జిల్లా మహాసభలో వారు ఎన్నికయ్యారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పలు డిమాండ్లను వివరించారు.సమాన పనికి సమాన వేతనం కనీసం రూ.26వేల వేతనం నిర్ధారించాలిని డిమాండ్ చేశారు. ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిలిచిపోయిన ఇండియన్ లేబర్ కౌన్సిల్ సమావేశాలను వెంటనే నిర్వహించాలిని కోరారు.ప్రభుత్వం ఉద్యమాలపై ఆంక్షలు విధించడం అన్యాయమని వారు పేర్కొన్నారు.
సీఐటియు అండతో ఆశా వర్కర్స్ యూనియన్ మరింత బలపడుతుందని వారు నమ్మకం వ్యక్తం చేశారు.ఈసమావేశంలో యూనియన్ నేతలు చౌగోని ధనలక్ష్మి, బొజ్జ సైదమ్మ, సాత్రి రేణుక, చిత్రం పద్మ, పెంజర్ల అనిత, గండమల్ల సంధ్య, దాసరి సుజాత, గదపాటి భారతి తదితరులు పాల్గొన్నారు.