calender_icon.png 8 November, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్‌పామ్ తోటలు సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలి

08-11-2025 12:00:00 AM

జిల్లా ఉద్యాన అధికారి నాగయ్య

కోదాడ నవంబర్ 7: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలోని రైతులను వరికి ప్రత్యామ్నాయం గా ఆయిల్ పామ్ తోటలను సాగు చేసే విదంగా ప్రోత్సహించాలని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య, జిల్లా కోపరేటివ్ అధికారి పి ప్రవీణ్ కుమార్ లు అన్నారు.. శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ రైతు వేదికలో పిఎసిఎస్ కార్యదర్శులకు ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులకు  నిర్వహించిన అవగాహనా సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు.

నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్ పామ్ తోటలను సాగు చేస్తే ప్రభుత్వం ద్వారా  మొక్కలను, డ్రిప్  రాయుతి,తోటల పెంపకనికి పెట్టుబడి నిమిత్తం ఎకరాకు 4200/ రూపాయలు నగదు   రైతులకు అందించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమం లో కోదాడ పి ఏ సి ఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,సాంకేతిక ఉద్యాన అధికారి  ముత్తినేని మహేష్, ఉద్యాన అధికారులు, పి అనిత, ఎల్ ప్రదీప్తి, అసిస్టెంట్ రిజిస్టర్లు కే పద్మజ ఎం రాంబాయి, మండల వ్యవసాయ అధికారిని రజని, పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ మేనేజర్ లు జె హరీష్, శశి కుమార్, ఏ ఈ ఓ సల్మా,  హెచ్ ఈ ఓ లు ముత్యంరాజు, సుధాకర్ రెడ్డి, ఇస్మాయిల్, అనిల్, ఫీల్ ఆఫీసర్ల వెంకట్, సాయి, శ్రీరామ్, పాల్గొన్నారు.