calender_icon.png 20 September, 2025 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాభివృద్ధికి ఉన్నతి, శిక్షా ఫౌండేషన్ సహకారం

20-09-2025 12:00:00 AM

తలకొండపల్లి సెప్టెంబర్19: మారుమూల ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న పేద విద్యార్దుల విధ్యాభివృద్దే లక్ష్యంగా ఉన్నతి,శిక్షా ఫౌండేషన్ పనిచేస్తుందని సంస్థ చైర్మన్,రిటైర్డ్ ప్రధానోపాద్యాయులు ఎర్ర సుదాకర్ రెడ్డి అన్నారు.తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామంలోని అంగన్వాడి కేంద్రానికి తమ ఫౌండేషన్ ద్వార బేంచిలు,చైర్స్,చిన్నపిల్లలు ఆడుకొవడానికి కావాల్సిన ఆట వస్తువులను అందజేశారు.

ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యా ర్థులు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ధీటుగా ఉండాలనే ఉధ్దేశ్యంతో పాఠశాల సమయం తర్వా త సాయంత్రం ట్యుటర్ ను ఏర్పాటు చేసి ప్రతినెల తమ ఫౌండేషన్ ద్వార వేతనం చెల్లిస్తూ విద్యార్థులకు ట్యూషన్ చెప్పిస్తున్నామని సుదాకర్ రెడ్డి తెలిపారు.

ఫౌండేషన్ కార్యదర్శి, మాజీ సర్పంచ్ బండి రఘుపతి, ఉపాద్యాయులు నాయుడు, అంజమ్మ, మాజీ వార్డ్ సభ్యుడు పెంటయ్య, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, సుదర్శన్ గౌడ్, బాలరాజు గౌడ్, గణేశ్ పాల్గొన్నారు.