calender_icon.png 20 September, 2025 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులదే

20-09-2025 12:00:00 AM

మంచిర్యాల, సెప్టెంబర్ 19 (విజయక్రాం తి): విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే బాధ్య త ఉపాధ్యాయులదేనని, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా టీఎల్‌ఎం మేళాకు ముఖ్య అతిథిగా హాజరై  డీఈవో యాదయ్య, ఇతర అధికారులతో కలిసి మేళాను ప్రారంభించారు.

కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల తల్లిదం డ్రులలో దినసరి కూలీలు, ఉద్యోగులు, అనే క రంగాలలో పని చేస్తున్న వారు ఉంటారని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉన్నతమైన విద్యను అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తారని, పిల్లల అవసరాలు తీర్చి ఏకాగ్రతతో చదువుకునేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తారన్నారు.

ప్రభుత్వ పాఠశా లలో చదివే విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషలలో చదవడం, రాయడం, మాట్లాడడం తప్పనిసరిగా వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు.  అనంతరం సైన్స్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆవిష్కరణలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.