20-09-2025 12:53:09 AM
నిర్మల్,(విజయక్రాంతి): భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ అడిషనల్ ఎస్పీ హోదా పదోన్నతి పొందిన సందర్భంగా శుక్రవారం జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ... "ఒక అధికారి వృత్తి జీవితంలో పొందే పదోన్నతి అనేది కేవలం పదవి పెరుగుదల మాత్రమే కాదు, అది ఆయన చూపిన కృషి, అంకితభావం, క్రమశిక్షణకు లభించే గుర్తింపు. భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ ఇప్పటివరకు ప్రజలతో మమేకమై పనిచేసిన తీరు, బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరే ఆయనకు ఈ పదోన్నతి రావడానికి ప్రధాన కారణం.
ఇకపై కూడా కొత్త బాధ్యతల్లో అదే ఉత్సాహం, నిజాయితీతో ముందుకు సాగుతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది." అని అభినందించారు. "ఈ పదోన్నతి నాకు వ్యక్తిగత గౌరవం మాత్రమే కాకుండా, నా ముందుండి నడిపిస్తున్న జిల్లా ఎస్పీ గారి ప్రోత్సాహం, మార్గనిర్దేశం, అలాగే నాతో పాటు పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికీ చెందుతుంది. భవిష్యత్తులో కూడా నా సేవల ద్వారా పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రతిష్టను మరింత పెంపొందించేలా కృషి చేస్తాను." అని తెలిపారు.