calender_icon.png 20 September, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు సురుకు పెట్టాలి

20-09-2025 01:19:03 AM

  1. కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్ 
  2. రెండు పార్టీలు కలిసి కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నయ్ 
  3. క్యాబినెట్‌లో ఒక్క ముస్లిం మంత్రైనా లేరు 
  4. కాంగ్రెస్ మోసాలతో ఏ ఒక్క ఆడబిడ్డ సంతోషంగా లేదు 
  5. మోదీ, అదానీలను రాహుల్‌గాంధీ విమర్శిస్తే సీఎం రేవంత్ వెనుకేసుకొస్తున్నారు 
  6. ‘వక్ఫ్’ సవరణలు దేశంలోనే తొలిసారి అమలైంది తెలంగాణలోనే.. 
  7. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 
  8. తెలంగాణ భవన్‌లో పార్టీ ‘జూబ్లీహిల్స్’ ఎర్రగడ్డ డివిజన్ సమావేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు దొంగ హామీలిచ్చి, అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చిందని, ఆ తర్వాత వాటిని అమలు చేయకుండా మోసం చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించుకుని కాంగ్రెస్ ప్రభుత్వా నికి సురుకు పెట్టాలని పిలుపునిచ్చారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సన్నాహాల్లో భాగంగా శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఎర్రగడ్డ డివిజ న్ బూత్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రేపటి తెలంగాణ భవిష్యత్తును ఈ ఉప ఎన్నిక నిర్ణయించబోతున్నదని అభిప్రాయపడ్డారు. పొరపాటున కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపిస్తే సంక్షేమ పథకాలను అమలుచేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్ నేతలు చేతులెత్తేస్తారని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్‌రెడ్డి సర్కార్ అని పేర్కొన్నారు. ప్రజల గొంతుకైన కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న లక్ష్యంతో బీజేపీ, కాంగ్రెస్ పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంతో రాష్ట్రంలో ఏ ఒక్క ఆడబిడ్డ సంతోషంగా లేదని, మంత్రులు సీతక్క, సురేఖ మాత్రమే సంతోషంగా ఉన్నారని మంత్రులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ ఓట్ చోరీ అంటూ ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని, కార్పొరేట్ శక్తి అదానీ వ్యాపార సామ్రాజ్యంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, కానీ.. సీఎం రేవంత్ మాత్రం మోదీని, అదానీని వెనుకేసుకొస్తున్నారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ఎందుకు పనికిరాదన్న గుజరాత్ మోడల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రశసించారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి ఒకప్పుడు సీబీఐని  వేటకుక్కతో పోల్చారని, ఇప్పుడా వేటకుక్కను సీదా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మీదకే ప్రయోగించారని మండిపడ్డారు.

దేశంలోని ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం చేసిన వక్ఫ్ చట్ట సవరణలకు వ్యతిరేకంగా రాజ్యసభలో బీఆర్‌ఎస్ ఓటు వేసిందని గుర్తుచేశారు. వక్ఫ్ సవరణలను దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అమలు చేసింది..  తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. క్యాబినెట్‌లో ఒక్క ముస్లిం మంత్రైనా లేకుండా కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ర్టమంతా ఒక తీరుగా తీర్పునిస్తే, హైదరాబాద్ ప్రజలు మా బీఆర్‌ఎస్‌ను గుండెల్లో పెట్టుకున్నారని కొనియాడారు.

నాడు ప్రత్యర్థులు బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి  గోపీనాథ్‌పై ఎన్ని ఆరోపణలు చేసినా, నియోజకవర్గ ప్రజలు మాగంటి గోపీనాథ్‌కే జైకొట్టారని గుర్తుచేశారు. గోపినాథ్‌కు నాడు జైకొట్టిన విధంగానే ఉప ఎన్నికలో ఆయన సతీమణి సునీతమ్మకు జైకొట్టాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూలగొట్టడమని, హైదరాబాద్‌లోని బస్తీ ప్రజలు కాంగ్రె స్ ప్రభుత్వం ఎక్కడ తమ ఇంటిని కూలగొడుతుందోనని భయంతో బతుకుతున్నారని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ అధికారం లో ఉన్న పదేళ్లలో ఏ రోజూ పేదోడి ఇంటిని కూలగొట్టలేదని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి దుర్గంచెరువులో ఇల్లు కడితే హైడ్రా బుల్డోజర్ వెళ్లదని, కానీ.. పేదలు కట్టుకున్న ఇండ్లపైకి మాత్రం బుల్డోజర్ వెళ్తుందని నిప్పులు చెరిగారు.

ప్రజలు మళ్లీ పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే ‘మీ వేలుతో మీ కంటినే  పోడుచుకున్నట్టే’ అని వ్యాఖ్యానించారు. తాను మోదీ దగ్గర స్కూ ల్, చంద్రబాబు దగ్గర కాలేజీ, రాహుల్‌గా ంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నానని చెప్పుకొన్న సీఎం రేవంత్, కేసీఆర్ దగ్గర హైస్కూల్ చదువుతుంటే, ఫెయిల్ అయ్యార ని రేవంత్‌ను పార్టీ నుంచి వెళ్లగొట్టారని ఎద్దేవా చేశారు. 

‘ఆల్మట్టి’ ఎత్తు పెంపు మరణశాసనం-

కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే, అది తెలంగాణ రైతాంగానికి మరణ శాసనమవుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని, మూడు రోజుల కిందట కర్ణాటక మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నదని, అయినప్పటికీ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.

ఆల్మట్టి ఎత్తు పెంపు అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, కేసు న్యాయస్థానం పరిధిలో ఉండగానే కర్ణాటక సర్కార్  నిర్ణయం తీసుకో వడం దారుణమన్నారు. కర్ణాటక ప్రభుత్వం కేవలం 100 టీఎంసీల జలాల కోసమే డ్యాం ఎత్తు పెంచడం లేదని, కృష్ణా జలాలో తెలంగాణ వాటాకు గండికట్టాలని చూస్తున్నదని ఆరోపించారు. డ్యాం ఎత్తుపెరిగితే ఉ మ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు ఎడారులుగా మారతాయని పేర్కొన్నారు.

రెండుచోట్ల పాలించేది కాంగ్రె స్ ప్రభుత్వాలేనని,  తెలంగాణ రైతులకు అన్యాయం చేయాలని కర్ణాటక ప్రభుత్వం చూస్తుంటే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కర్నాటక ప్రభుత్వ కుట్రను అడ్డుకోకపోతే బీఆర్‌ఎస్ రైతులతో కలిసి మహోద్యమం చేస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ హ యాంలో 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు  ఎత్తిపోతల పథకం నిర్వీర్యమవుతుంటే ఒక పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నించారు.

కృష్ణా జలాలు రాక పోతే జూరాల నిండదని, సీఎం మొదలుపెట్టిన నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం కూడా పడావు పడుతుందని అభిప్రాయపడ్డారు. కేవలం ఐదు అడుగుల ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం భూసేకరణకు రూ. 70 వేల కోట్లు ఖర్చు వెచ్చిందని, తద్వారా 1.30 లక్షల ఎకరాలు సేకరించనున్నదని పేర్కొన్నారు. కేవలం 5 అడుగుల పెంపునకే కర్ణాటక అంత మొత్తంలో నిధులు వెచ్చిస్తే, మూడు బరాజ్‌లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల మేర సొరంగాలు, 1,700 కిలోమీటర్ల మేర కాలువలు..

40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వ రం ప్రాజెక్టుకు బీఆర్‌ఎస్ రూ.93 వేల కోట్లు ఖర్చు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. 40 లక్షల ఎకరాలకు నీరందించే కాళేశ్వరం పరిధిలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు దుర్మార్గమైన ప్రచారం చేశారని మండిపడ్డారు. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటించారని, కానీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఇంకా మొద్దునిద్ర వీడలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బలిపెట్టి సీఎం గోదావరి జలాలను ఏపీకి ధారాదత్తం చేశారని ఆరోపించారు.

ఓట్ చోరీ కంటే ఎమ్మెల్యేల చోరి పెద్ద నేరం

ఓట్ చోరీపై ఏఐసీసీ అగ్రనేత నేత రాహుల్‌గాంధీ గొంతు చించుకుంటున్నారని, తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చోరీ చేసిన అంశంపై మాత్రం ఎందుకు స్పందించడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిలదీశారు. ఎవరి బలం ఏంటో ప్రజాక్షేత్రంలో తిరిగి తేల్చుకుందామన్నారు. ప్రజాస్వామ్యంలో ఓట్ల చోరీ నేరమైతే, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను చోరీ చేయడం అంతకంటే పెద్ద నేరమని అభిప్రాయపడ్డారు.

రాహుల్ గాంధీకి దమ్ముంటే బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. అలా చేస్తేనే రాహుల్‌గాంధీకి ఓట్ చోరీపై మాట్లాడే నైతిక హక్కు వస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పి, గల్లీలో అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం రాహుల్ గాంధీకి వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు.

దేశమంతా పర్యటిస్తూ ఈవీఎంల ట్యాంపరింగ్, ఓట్ల చోరీ గురించి ఉపన్యాసాలు ఇస్తున్న రాహుల్‌గాంధీకి, తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల చోరీ కనిపించకపోవడం ఆయన ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ సిద్ధాంతాలు, పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని విశ్వసించి రాష్ట్రప్రజలు గెలిపించిన పది మం దిని ఎమ్మెల్యేలుగా గెలిపించారని, వారికి డబ్బు ఎర వేసి కాంగ్రెస్‌లో చేర్చుకోవడం అనైతికమని మండిపడ్డారు. ప్రజాతీర్పును అపహాస్యం చేసి సంతలో పశువుల్లా ఎమ్మెల్యేల కొనుగోలుపై  రాహుల్ గాంధీ సమా ధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  

‘జూబ్లీహిల్స్’లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తాం

జూబ్లీహిల్స్ ఉప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తామని మాల సామాజిక వర్గం నాయకులు స్పష్టం చేశారు. మాల సామాజికవర్గానికి చెందిన నేతలు శుక్రవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఎస్సీ రిజర్వేషన్లు, వర్గీక రణ అమలు అంశాలపై చర్చించారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్లపై రాష్ట్రప్రభు త్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని ఆరోపించారర. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలో దించుతామని ప్రకటించారు. వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ మాల సామాజిక వర్గ నేతను పోటీలో పెడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించి, తమ సత్తా ఏంటో కాంగ్రెస్‌కు చూపిస్తామని సవాల్ చేశారు.