12 May, 2026 | 8:57 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

శ్రీధర్‌బాబుతో యూఎన్‌వో అండర్ సెక్రటరీ భేటీ

29-08-2024 01:48 AM

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): మిలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అగ్రిఫుడ్ వ్యవస్థల్లో మహిళ లు, చిన్న తరహా పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచేందుకున్న అవకాశాలపై ఐక్యరాజ్య సమితి రాష్ట్రంలో ఓ అధ్యయనాన్ని చేపట్ట నుంది. ఐక్య రాజ్య సమితి అండర్ సెక్రటరీ జనరల్ ఆర్మిడా సల్సియాహ్ అటిస్జాహ్బానా బుధవారం సచివాలయంలో ఐటీ, పరిశ్రమ ల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు.

ఎకనామిక్, సోషల్ కమిషన్ ఫర్ ఆసియా పసిఫిక్ సంస్థ తెలంగాణకు చెందిన పది సంస్థలకు ఇప్పటి కే శిక్షణ ఇచ్చింది. సమాజంలోని అట్టడుగు వర్గాలను ప్రధాన స్రవంతిలో భాగస్వాము లను చేసేందుకు ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్ ను రూపొందించింది. తదుపరి కార్యాచరణ కోసం ప్రభుత్వ సహాయం కోరింది. ఈ భేటీలో టీజీఐఐసీ సీవోవో మధుసూద న్‌రెడ్డి, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం డైరెక్టర్ అఖిల్, లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్ప తదితరులు పాల్గొన్నారు.