20-12-2024 12:00:00 AM
పీకేఎల్ 11వ సీజన్
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో యూపీ యోధాస్ భారీ విజయాన్ని అందుకుంది. గురువారం పుణే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో యూపీ యోధాస్ 59 గుజరాత్ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది. యూపీ తరఫున గగన్ గౌడ (19 పాయింట్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. భవానీ రాజ్‌పుత్ (11) సూపర్ టెన్‌తో మెరిశాడు. గుజరాత్ తరఫున రెయిడర్ గుమన్ సింగ్ 7 పాయింట్లు సాధించాడు. ఇప్పటికే యూపీ యోధాస్ ప్లేఆఫ్స్‌కు చేరిన సంగతి తెలిసిందే.
మరో మ్యాచ్‌లో యు ముంబా 43 తేడాతో పట్నా పైరేట్స్‌పై విజయాన్ని నమోదు చేసుకుంది. యు ముంబా తరఫున అజిత్ చౌహన్ (15 పాయింట్లు) సూపర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మరో రెండు ప్లే ఆఫ్స్ కోసం నాలుగు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నేటి మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగాల్ వారియ ర్స్, పునేరి పల్టన్స్‌తో తెలుగు టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.