calender_icon.png 14 November, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్నీత్ ట్రిపుల్ బొనాంజ

19-12-2024 11:47:22 PM

జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్

జంషెడ్‌పూర్: పంజాబ్ ఆర్చర్ పర్నీత్ కౌర్ ఆర్చరీ జాతీయ చాంపియన్‌షిప్‌లో ట్రిబుల్ బొనాంజ సాధించింది. గురువారం మహిళల విభాగంలో పర్నీత్ రెండు స్వర్ణాలు, ఒక కాంస్యం సొంతం చేసుకుంది. తొలుత సింగిల్స్‌లో పర్నీత్ 146 మధ్యప్రదేశ్‌కు చెందిన శ్రిష్టి సింగ్‌ను ఓడించి స్వర్ణం గెలుపొందింది. ఆ తర్వాత మిక్స్‌డ్ టీమ్‌లో ఉదయ్ కంబోజ్‌తో జత కట్టిన పర్నీత్ 158 మహారాష్ట్రపై గెలుపొంది పసిడి దక్కించుకుంది. ఇక టీమ్ విభాగంలో మహారాష్ట్ర 235 తేడాతో సర్వీసెస్‌ను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. రికర్వ్ సెక్షన్‌లో దివ్యాన్ష్ చౌదరీ (హర్యానా) తెలుగు ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరతో టైటిల్ ఫైట్ కోసం తలపడనున్నాడు. ఇక మహిళల విభాగంలో స్టార్ ఆర్చర్ దీపికా కుమారి కోల్‌కతాకు చెందిన అంకితా భాకత్‌తో తలపడనుంది.