23-10-2025 12:00:00 AM
-ఖాళీ జాగా.. వేసేయ్ పాగా.. డాక్యుమెంట్ ఎక్కడిదైతే మాకేంటి
-గిరిజన చట్టాలకు తూట్లు
-సర్వే నెంబర్ 61/2/అసైన్డ్ పట్టా... 817/1లో ఆక్రమణ
-అధికారుల అలసత్వం అక్రమార్కులకు వరం
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 22, (విజయక్రాంతి):ఆగని ప్రభుత్వ భూముల ఆక్రమణ. ఖాళీ జాగా వేసేయి బాగా అన్న ట్లు వ్యవహరిస్తున్నారు భూ బకాసురులు. కొనుగోలు చేసిన డాక్యుమెంట్స్తో పని లేకుండా ఎక్కడ అనుకూలమైన స్థలం కనిపిస్తే దాన్ని ఆక్రమించి దర్జాగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు తెర లేపుతున్నారు ప్రబుద్ధులు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని, అందిన కాడికి పుచ్చుకొని నెమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తు న్నారని ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
మొన్న హెచ్ కన్వెన్షన్ హాలు... నేడు మరో కుల సంఘం భవనం
పేపర్తో పనేంటి, మనకు అనుకూలంగా స్థలం ఎక్కడ ఉన్నా అక్కడ తిష్ట వేసేయ్ అన్నట్లు ఉంది అక్రమార్కుల పనితీరు. మొన్న హెచ్ కన్వెన్షన్ హాల్ నిర్మాణంలో 817 /58 సర్వే నంబర్లు భూమి కొనుగోలు చేసిన పేపర్ల ఆధారంగా 817/1 సర్వే నంబర్లు దర్జాగా ఎలాంటి అనుమతులు లేకుండా భవనాలు నిర్మించి వ్యాపారం చేస్తున్న వైనం విజయక్రాంతి వెలుగు చూపిన విషయం విదతమే. సదరు హెచ్ కన్వెన్షన్ యజమాని డాక్యుమెంట్ల ప్రకారం అతని భూమి కేఎల్‌ఆర్‌ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఉంటుంది. కానీ ఆ మూత భారీ రోడ్డు పక్కన రెండు పంచాయతీల సరిహద్దులో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేశారు.
అతను చేయంగా లేనిది మనం చేస్తే తప్పేందన్నట్లు అనుకున్న మరో ప్రబుద్ధుడు 61/2/అ సర్వే నెంబర్లు భూమినికొనుగోలు చేసి 817/1 భూమి చదును చేసే పనులను ప్రారంభించారు. హెచ్ కన్వెన్షన్ హాల్ సమస్య పరిష్కారం దిశలో అధికారులు కదలక పోవడంతో మరో ఆక్రమణకు శ్రీకారం చుట్టారు. ఓ కుల సంఘానికి భావన నిర్మాణం కోసం అదే దారిలో 61/2/అ సర్వే నంబర్లు ఎస్త్స్రన్డ్ పట్టా లోని మూడు ఎకరాల భూమిని పిఓటిని అతిక్రమించి ఓ గిరిజనేతరుడు కొనుగోలు చేశారు. ఆ గిరిజనేతరుడు ఓ కుల సంఘం భవన నిర్మాణానికి పిఓటీ చట్టాలను అతిక్రమించే విక్రయించారు. కుల సంఘం నాయకులు కొనుగోలు చేసిన ప్రాంతంలో కాకుండా 817/1 సర్వే నెంబర్లు ఏకంగా భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఒకవైపు గిరిజన చట్టాలను అతిక్రమించి ఎస్త్స్రన్డ్ పట్టాలను గిరిజనుల నుంచి గిరిజనులకే బదలాయింపు చేయాలనే నిబంధనను అతిక్రమించడమే కాకుండా, రెండు దఫాలుగా గిరిజనే తరులు కొనుగోలు చేయడం, రెవెన్యూ అధికారులు అందిన కాడికి పుచ్చుకొని పహానిలో గిరిజ నేతరుడి పేరు అనుభవ దారి కాలంలో నమోదు చేయడం గమనార్హం. ఇలా ఎవరికివారు చట్టాలను తుంగలో తొక్కి అక్రమార్జనకు తెర లేపుతున్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విజయక్రాంతి వరుస కథనాలు ప్రచురితమైన జిల్లా కలెక్టర్లు సైతం చలనం లేకపోవడంతో అదే మార్గంలో ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించిన ఆక్రమించే పనిలో ఉన్నారు మోతుబరులు.
ఇది ముమ్మాటికి రెవెన్యూ అధికారుల అలసత్వమే అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎప్పటికైనా పాల్వంచ పట్టణంలోని ప్రభుత్వ భూములు 817,999,444,727 సర్వే నెంబర్లలో సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని లేనిపక్షంలో రికార్డుల్లో ప్రభుత్వ పదిలంగా కనిపించిన, క్షేత్రస్థాయిలో సెంటు భూమి కూడా మిగలని పరిస్థితి దాపురించటం ఖాయం. రెవెన్యూ మంత్రి ఇలాఖాలోనే ఈ పరిస్థితి దాపురిస్తే ప్రభుత్వ భూముల పరిరక్షణలో ప్రభుత్వ తీరు తేటతెల్లమవుతోంది.
పీఓటీ వాయిలెన్స్ కేసు నమోదు చేస్తాం.. తహసీల్దార్ ధారా ప్రసాద్
పాల్వంచ మండల పరిధిలోని సర్వేనెంబర్ 817/1 లో జరుగుతున్న ప్రభుత్వ భూమి ఆక్రమణ అంశమై తాసిల్దార్ ధారా ప్రసాదను వివరణ కోరగా, 61/2/అ లో ఎప్పుడో గిరిజనులకు ఎస్త్స్రన్డ్ చేశారని, ఆ తర్వాత గిరిజనేతరుడు కొనుగోలు చేసి అనుభవదారి కాలంలో చేరినట్లు అంగీకరించారు. ఇది పిఓటి వైలెన్స్ అని, తదుపరి ఆ గజనేతరుడు మరో కుల సంఘానికి విక్రయించడం జరిగిందన్నారు. రికార్డులను పరిశీలించి పిఓటి వాయ్ లెన్స్ కేసు నమోదు చేస్తామని, అట్టి భూమికి ఎలాంటి హక్కులను కల్పించమన్నారు.