calender_icon.png 23 October, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సహాయం అందజేసిన కాసోజు శంకరాచారి

23-10-2025 04:31:04 PM

చిట్యాల (విజయక్రాంతి): మృతుని కుటుంబ సభ్యులకు కాసోజు శంకరాచారి గురువారం పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన గంజి క్రాంతి కుమార్(34) అనారోగ్యంతో మృతిచెందగా ఆయన పార్దివదేహానికి కాసోజు శంకరాచారి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

అనంతరం మాట్లాడుతూ క్రాంతి మృతి చాలా బాధాకరమని, యువత సమస్యలు ఎదురైతే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి కానీ బలవన్మరణాలకు పాల్పడకూడదని, దేశానికి వెన్నెముక లాంటి యువత ఇలా విగత జీవులుగా మారడం విచారకరమని, క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్ల ప్రవీణ్ రెడ్డి, కర్నాటి శివకృష్ణ, ఆవుల శ్రీనివాస్, మాజీ వార్డ్ మెంబర్ మిర్యాల నరేష్, వడ్డగాని సైదులు, మిరియాల మల్లికార్జున్,మిషన్ నగేష్, వీరమల్ల శ్రీనివాస్, బొబ్బలి నరసింహ, శ్రీరామోజు నరేష్ తదితరులు పాల్గొన్నారు.