calender_icon.png 23 October, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం

23-10-2025 04:50:59 PM

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలి..

ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దు..

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి (విజయక్రాంతి): గంగాధర మండలంలోని హిమ్మత్ నగర్, గట్టుభూత్కుర్, చిన్న అచంపల్లి, పెద్ద అచంపల్లి, గర్షకుర్తి తాడి జెర్రి, రంగారావు పల్లి, ఉప్పరమల్యాల, కురిక్యాల, మల్లాపూర్, వెంకంపల్లి, మధురానగర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ సహకార సంఘం, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని  హామీ ఇచ్చారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.

కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, రైతుల కోసం నీడ ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రాలకు రైతుల వివరాలను నమోదు చేసుకొని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురికావద్దని, సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, ఎమ్మార్వో అంబటి రజిత, ఎండిఓ రామ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, సాగి అజయ్ రావు, బుర్గు గంగన్న, రాజగోపాల్ రెడ్డి, రోమాల రమేష్, పడితపల్లి కిషన్, చక్రపాణి, శ్రీనివాస్, లక్ష్మణ్, హన్మంత రెడ్డి, మహేష్, ఆనంద్, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.