23-10-2025 04:38:39 PM
మాలాధారణ చేసిన జయరామ్ గురుస్వామి..
అచ్చంపేట: నల్లమల్ల అభయారణ్యంలోని నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగులో వెలసిన శ్రీపబ్బతి ఆంజనేయ స్వామి మాలధారాన దీక్షలు గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. అచ్చంపేట సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఉమామహేశ్వరం దగ్గర ఉన్న భోగమహేశ్వరంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద దీక్షలను జయరాం గురుస్వామి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు దీక్షలు స్వీకరించారు. కొండకింది ప్రాంతమంతా ఆంజనేయస్వామి భజనలతో ప్రతిధ్వనించింది. 41 రోజులపాటు స్వాములు అంజన్న సేవలో తరించనున్నారు. అర్చకులు వీరయ్యశాస్త్రి దీక్ష విశిష్టతను స్వాములకు వివరించారు. అనంతరం స్వాముల కోసం ఏర్పాటుచేసిన బిక్షను ఆలయ అర్చకులు బీరం మాధవరెడ్డి, ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు అందించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.