calender_icon.png 23 October, 2025 | 1:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అభివృద్ధికి పక్కా ప్రణాళిక- : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

23-10-2025 12:00:00 AM

ఖమ్మం, అక్టోబర్ 22 (విజయ క్రాంతి): తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అభివృద్ధికి పక్కా ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు ప్ర భుత్వ ఉన్నత పాఠశాల, మధిర మండలం మహదేవపురం జెడ్పిహెచ్‌ఎస్, చింతకాని మండలం నాగులవంచ జెడ్పిహెచ్‌ఎస్ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా అభివృద్ధి చేసేందుకు పైలెట్ ప్రాజెక్టు క్రింద ఎం పిక చేయడం జరిగిందన్నారు.

పైలెట్ ప్రాజె క్టు క్రింద ఎంపిక చేసిన పాఠశాలల హెడ్ మాస్టర్‌లు వెంటనే పాఠశాల అభివృద్ధి నిర్వహణ కమిటీ పేరిట ప్రత్యేక బ్యాంక్ ఖాతా ప్రారంభించాలన్నారు. ఖ మ్మం సమగ్ర శిక్ష ఫైనాన్స్ అకౌంట్ ఆఫీసర్ డెమో ప్రాజెక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ పేరిట కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఉపయోగించే విధంగా జాయింట్ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్నారు. జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సి.హెచ్. రామకృష్ణ, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.