02-05-2025 12:07:08 AM
స్పందించని అధికారులు
ఇల్లెందు, మే 1 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం, మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల గాలి వాన కారణంగా పట్టణ వాసులు అతలాకుతలమయ్యారు. మండల పరిధిలోని మామిడిగూడెం పంచాయతీలోని యాదల్లపల్లి గ్రామంలో యాదల్లపల్లి చంద్రయ్య ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. ఇంటిపై ఉన్న సిమెంటు రేకులు పగిలి పోవడం, టీవీ, ఫ్యాన్ కాలిపోవడం, బియ్యం తడిసి ముద్దయి తీవ్రంగా నష్టం వాటిల్లింది.
తినటానికి తిండి లేకుండా రాత్రి నుంచి ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం తరఫున ఏ అధికారి తమను పరామర్శించి, తమకు జరిగిన నష్టం పై ఎలాంటి నివేదికలు తయారు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల నాయకుల బృందం గురువారం బాధిత కుటుంబం ని పరామర్శించి దైర్యం చెప్పారు.ఈ సందర్బంగా న్యూడెమోక్రసీ డివిజన్ నాయకుడు.
తోడేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ అకాల వర్షం, గాలి దుమరానికి ఇళ్ళు పూర్తిగా ద్వoసం అయింది అని వెంటనే ప్రభుత్వం ఇంధీరమ్మ గృహం మంజూరు చేయాలనీ, ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా రాకపోవడం బాధాకరం అన్నారు.తక్షణ సహాయం కింద రూ 1 లక్ష అందచేయాలనీ, లేనీ పక్షంలో కుటుంబం తో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో న్యూడెమోక్రసీ మండల నాయకులు మూడు మాలు, జోగా క్రిష్ణ, గుర్రం పవన్ పాల్గొన్నారు.