calender_icon.png 21 May, 2025 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కానిస్టేబుట్‌కు ఏసీపీ పరామర్శ

02-05-2025 12:06:27 AM

యాదాద్రి భువనగిరి మే 1 (విజయక్రాంతి):  పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ డీ మురళీ కాలు పైనుంచి కారు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు.  బుధవారం నాడు గంజ్ ప్రాంతంలో ఎమ్మెల్యే మీటింగ్ అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా ఓ కార్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల కానిస్టేబుల్ కాలు మీది నుండి వెళ్లడంతో గాయపడ్డాడు. సహచర పోలీసులు వెంటనే  ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.  ఈ విషయం తెలిసిన భువనగిరి డివిజన్ ఎసిపి  కె. రాహుల్ రెడ్డి, ఐపీఎస్, భువనగిరి పట్టణ సీఐ  సురేష్ కుమార్ , కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.  విధి నిర్వహణలో  పోలీస్ సిబ్బందికి ఎలాంటి ప్రమాదం ఎదురైనా, శాఖ వారి పట్ల పూర్తి అండగా ఉంటుందని ఏసీపీ తెలిపారు.