ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా మహిళా క్రికెట్ ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఎమర్జిం గ్ ఉమెన్స్ క్రికెట్ లీగ్ (ఈడబ్ల్యూసీఎల్) లో గోను జూబ్లీహిల్స్‌లోని ఎంఎంసీసీసీలో ఆవిష్కరించారు. లీగ్‌లో పాల్గొననున్న 16 జట్లను అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శ్రీచరణ మీడియా మేనేజింగ్ డైరెక్ట ర్లు బుస్సా శ్రీనివాస్ గుప్తా, బుస్సా మాధవి గుప్తా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈడబ్ల్యూసీఎల్‌కు అధికారిక ఏజెన్సీ భాగస్వామిగా వ్యవహరిస్తున్న శ్రీ చరణ మీడి యా మహిళా క్రికెట్ రంగంలో అభివృద్ధి చెందుతున్న ప్రతిభకు జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించే ఈ ప్రతిష్ఠాత్మక లీగ్‌తో భాగస్వామ్యం కావడం గర్వకారణమని వా రు పేర్కొన్నారు. ఆగస్టు 15నుంచి ప్రారం భం కానున్న ఈడబ్ల్యూసీఎల్ దేశంలోని యువ మహిళా క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రదర్శించుకునేందుకు ఒక విశిష్ట వేదికగా ని లవనుంది. మహిళా క్రికెట్‌కు కొత్త దిశను ని ర్దేశించే ఈ వినూత్న కార్యక్రమం భవిష్యత్తు లోమరెంతోమంది క్రీడాకారిణులకు స్ఫూర్తి గా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.






