26-08-2025 01:30:14 AM
ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 25(విజయక్రాంతి): యూరియా సరఫరా లో కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని ఎమ్మె ల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సహకార సంఘం ఎదుట రైతులతో కలిసి ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే సీఎంకు కనిపించడం లేదా వారి ఆవే దన వినిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా యూరి యా కోసం రైతులు ఇబ్బందులు పడలేదని గుర్తు చేశారు.
రైతు సంక్షేమాన్ని గాలికి వదిలారని దీంతోపాటు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా కాలయా పని చేస్తున్న సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.రైతులు పడుతున్న బాధలు చూస్తే గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం కూడా యూరియా సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తుందని రాష్ర్ట ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త తీసుకోకపోవడంతోనే యూరియా సమస్య ఉత్పనం అయిందని అన్నారు.కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు డబల్ గేమ్ ఆపాలని పేర్కొన్నారు.