calender_icon.png 26 August, 2025 | 11:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో ఒత్తిడి నియంత్రణ

26-08-2025 01:32:03 AM

నిర్మల్ ఆగస్టు 25 (విజయక్రాంతి): నిర్మల్ కలెక్టరేట్‌లో సోమవారం టేబుల్ టెన్నిస్ కోర్టును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించారు. యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ రెండవ అంతస్తులో ఏర్పాటు చేసిన కోర్టును కలెక్టర్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించిన అనంతరం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి కాసేపు టేబుల్ టెన్నిస్ ఆడారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. కార్యాలయ పనిఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఉద్యోగులు, సిబ్బంది విధులు ముగిసిన తర్వాత కోర్టును వినియోగించుకోవాలని సూచించారు. టేబుల్ టెన్నిస్ ఆడటం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు.

అలాగే సాధారణ ప్రజల కోసం పట్టణంలో మరిన్ని టేబుల్ టెన్నిస్ కోర్టులను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. ఇంతకుముందు పర్యావరణ గణపతులను ప్రతి ఒక్కరు పూజించాలని కోరుతూ రూపొందించిన పోస్టర్లు జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

పర్యావరణ ర గణపతులను ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, సిపిఓ జీవరత్నం, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.