26-08-2025 01:28:57 AM
పోలీసుల దాడులతో బట్టబయలు
అదిలాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయం మాటున గంజాయి సాగు యదేచ్చగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పోలీసులు దాడు లు నిర్వహించిన గంజాయి సాగు మాత్రం అడగం లేదు. తాజాగా నార్నూర్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని సుంగాపూర్ గ్రామ శివారులో గంజాయి పండిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ బృందం, నార్నూర్ పోలీసులు సంయుక్తంగా పంట పొలాల్లో తనిఖీలు చేపట్టారు.
కాగా కొడప దేవురావు అనే వ్యక్తి వ్యవసాయం మాటున చట్ట వ్యతిరేకంగా గంజాయి సాగు చేస్తున్నారని తెలిసింది. 95 గంజాయి మొక్కలను పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై ఎన్.డి.పి.ఎస్ కేసు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వ్యవసాయ భూమిలో చట్ట వ్యతిరేకంగా గం జాయి మొక్కలను పండిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్నర్ సీఐ ప్రభాక ర్, సిసిఎస్ ఇన్స్‌పెక్టర్ చంద్రశేఖర్, నార్నూర్ ఎస్సు అఖిల్, అధికారులు పాల్గొన్నారు.