26-07-2025 11:59:12 PM
డిసిఓ పద్మ..
సూర్యాపేట (విజయక్రాంతి): రైతులకు ఎల్లప్పుడు యూరియా అందుబాటులో ఉంచేవిధంగా చూడాలని డిసిఓ పద్మ(DCO Padma) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో పిల్లలమర్రి ఎరువుల గోడౌన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలో ఉన్న నిల్వలను పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ఉదయం 8 గంటల లోపే షాపులు తెరవాలని సూచించారు. తదుపరి జిల్లాలో ఎరువులు అలాట్మెంట్ ఎంత, రైతులకు ఏ మేరకు విక్రయించారు, ప్రస్తుతం ఎంత అందుబాటులో ఉందనే వివరాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పిఐసి అసిస్టెంట్ రిజిస్టర్ బి.అంజయ్య, సంఘ సెక్రెటరీ జె శ్యాంసుందర్ రెడ్డి, సంఘ సిబ్బంది వి.వెంకట్ రెడ్డి, వెంకటేష్, వెంకన్న, నవకాంత్, నాగరాజు, రైతులు పాల్గొన్నారు.