calender_icon.png 8 January, 2026 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవసరం మేరకు యూరియా అందించాలి

06-01-2026 12:23:10 AM

అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి 

మేడ్చల్, జనవరి 5 (విజయ క్రాంతి): రైతులకు అవసరం మేరకు యూరియా అందించాలని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం తన చాంబర్లో నోడల్ అధికారి ఆశాకుమారితో కలిసి యూరియా నిలువలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  యూరియా నిల్వలు, రోజువారి పంపిణీ, ఇంకా ఎంత అవసరం వంటి అంశాలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కే చంద్రకళను అడిగి తెలుసుకున్నారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇంకా ఎంత అవసరం ఉందో ముందుగానే నిల్వ చేసుకోవాలన్నారు. సొసైటీలలో 173. 025 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్ ల వద్ద 210.06 మెట్రిక్ టన్నులు, మార్క్ ఫెడ్ బఫర్లో 405.135 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని తెలిపారు. ఈ సమావేశంలో డిసిఒ వెంకటరెడ్డి, డిఎం మార్క్ ఫెడ్ శ్రీదేవి పాల్గొన్నారు.