06-01-2026 12:23:28 AM
హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): ‘ఎమ్మెల్సీ కవిత పద్ధతి మార్చుకోవాలి. మా ఓపికను బలహీనతగా భావించొద్దు’ అని బీఆర్‌ఎస్ మహిళా నాయకురాళ్లు గొంగిడి సునీత, తుల ఉ మా, సుమిత్రానంద్ హెచ్చరించారు. పార్టీని (BRS)బీఆర్‌ఎస్‌గా మార్చినప్పుడు తనకు చెప్పలేదు అం టున్నారని, మరి ‘మీరు ఎందుకు (Telangana Jagruthi)తెలంగాణ జాగృతిని (Bharat Jagruthi)భారత జాగృతిగా మార్చారు’ అని ప్రశ్నించారు. జనం బాట పేరుతో బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని, బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆగ్రహిస్తే గ్రామాల్లో కూడా తిరగలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాసనమండలిలో కవిత వ్యాఖ్యలపై స్పందిస్తూ సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎవరో ఆడిస్తే ఆడుతూ (Kalvakuntla Chandrashekar Rao)కేసీఆర్‌ను క్షోభకు గురిచేయడం సరికాదన్నారు. బీఆర్‌ఎస్ అసెంబ్లీ బహిష్కరణ చేస్తే దానిపై ఏదేదో మాట్లాడారని, పార్టీలో ఎవ రు చెప్తే శాసన సభ బహిష్కరణ చేస్తారో తెలియదా అని ప్రశ్నించారు. ‘మీరు మనస్ఫూర్తిగా రాజీనామా చేయలేదా? నాలుగు నెలల క్రితం ఎ మ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఎందుకు పదవిలో కొనసాగారని నిలదీశారు. బీఆర్‌ఎస్ సభ్యు లు అసెంబ్లీ బహిష్కరణ చేస్తే మీరు శాసన మండలికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.
అంగన్‌వాడీలు, చాలామంది సమస్యలతో వస్తున్నారని చెప్పిన కవిత.. మండలిలో వారి సమస్యలపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ‘మీరు ఎంపీగా ఓడిపోతే మీకంటే సీనియర్ అయిన వినోద్ కుమార్ కాదని మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు’ అని గుర్తు చేశారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని అంటున్నారని, అదే లేకపోతే ‘మీరు పదవులు ఎలా ఇప్పించుకున్నారు’ అని ప్రశ్నించారు. అన్ని సమయాల్లో ‘బీఆర్‌ఎస్ పార్టీ మీకు అండగా ఉన్నది. మీరు జైలులో ఉన్నప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరంతరం మీకోసమే ఆలోచన చేశారు.
మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు మీ గురించి ఆలోచన చేసి ఢిల్లీలోనే మకాం వేశారు’ అని గుర్తుచేశారు. అలాంటి వాళ్లను పట్టుకొని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని హితవు పలికారు. ‘మండలిలో మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి తప్ప బీఆర్‌ఎస్ పార్టీపై, మా అధ్యక్షుడు పైన మాట్లాడకూడదు’ అని చెప్పారు. ఉద్యమం ప్రారంభం అయ్యాక ఆరు ఏండ్లకు కవిత ఉద్యమంలోకి వచ్చి అందిరిలాగానే పనిచేశారని, పని తగ్గట్టు ఆమెకు ఎంపీగా, ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిందన్నారు. ‘మీరు జైలుకు వెళ్లినప్పుడు పార్టీకి ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలుసు.
మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టిన సంగతి మర్చిపోతే ఎలా? మీరు అయోధ్య రాముడి గురించి పోస్టులు పెట్టీ పొద్దున్నే డిలీట్ చేసింది మీరు కాదా?. మీరు చేసే జాగృతి కార్యక్రమాలకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు పనిచేయలేదా?’ అని నిలదీశారు. మీరు శాసన మండలిలో మా ట్లాడిన మాటలతో ఎవరికి లాభం జరుగుతుందన్నారు. వ్యక్తిగత విషయాల కోసం కవిత కన్నీళ్లు పెట్టుకున్నదని, ఆవేదనతో పార్టీకి, కేసీఆర్‌కు నష్టం చేసే పనిచేస్తోందని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా కేజ్రీవాల్‌పై నమ్మకం ఉండేదని, ‘మీ లిక్కర్ స్కాం వల్ల కేజ్రీవాల్ అంతకుఅంత దిగజారి పోయారని, ఆయనను చెడగొట్టిన ఖాతాలో మీరే ఉన్నారు’ అని విమర్శించారు. ‘లిక్కర్ స్కాంలో మీ పాత్ర లేదు’ అని ఇదే లక్ష్మీనరసింహ స్వామి మీద ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. ‘మీ వల్లనే’ కేసీఆర్‌కు మచ్చ వచ్చిందని, యావత్తు తెలంగాణకు తెలుసన్నారు. కేసీఆర్‌పై అడుగడుగనా బురద జల్లే పనిచేస్తే ఎవరూ క్షమించరని హెచ్చరించారు.