13-11-2025 06:30:03 PM
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..
హుజురాబాద్ (విజయక్రాంతి): స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాదిమంది భారతీయుల్లో స్ఫూర్తినింపిన ధ్యేయం వందేమాతరమని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని హుజురాబాద్ బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ చౌరస్తాలో వందేమాతరం గేయాలపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేమాతరం గేయాన్ని నవంబర్ 7, 1875న బంకించంద్ర సెటర్జీ రచించారన్నారు. ప్రధానంగా ఈ గీతం స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, భారతీయుల్లో చైతన్యాన్ని, స్ఫూర్తి, దేశభక్తినీ రగిల్చిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా చేపడుతున్న వందేమాతర కార్యక్రమాలలో బిజెపి సైతం పాలు పంచుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ, మండల అధ్యక్షులు తూర్పాటి రాజు, రాముల కుమార్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, నాయకులు రాజిరెడ్డి, తిప్పబత్తిని రాజు, యాంసాని శశిధర్, అంకతి వాసు, కొలిపాక శ్రీనివాస్, నల్ల సుమన్, పోతుల సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.