calender_icon.png 20 September, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఉషారాణి

19-09-2025 10:13:42 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ మున్సిపల్ అంకుశాపూర్‌లోని సాంఘిక సంక్షేమ డిగ్రీ మహిళా కళాశాల మహేంద్ర హిల్స్ అథ్లెటిక్స్ అకాడమీ విద్యార్థిని పి. ఉషారాణి జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. ఈనెల 23 నుండి 25 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా  నాగార్జున యూనివర్సిటీలో జరగనున్న 35వ జాతీయ సౌత్‌జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలలో ఆమె పాల్గొననుంది.