calender_icon.png 20 September, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్యం అంటే ఓటు వేయడం కాదు..

19-09-2025 10:10:51 PM

సమాజానికి దిక్సూచిగా నిలిచే నాయకుడిని ఎన్నుకోవాలి

తహసీల్దార్ లాలు నాయక్, ఎస్ఐ గోపికృష్ణ

పెన్ పహాడ్: ప్రజాస్వామ్యం అంటే ఓటు వేయడం కాదని.. తమ ఓటు సమాజానికి దిక్సూచిగా  నిలిచే నాయకుడిని ఎన్నుకోవాలని అప్పుడే తాము చేసిన ఓటుకు సార్ధకత మిగులుతుందని తాసిల్దార్ లాలూ నాయక్, ఎస్ఐ గోపికృష్ణ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అనాజిపురం ఆదర్శ పాఠశాల-కళాశాలలో విద్యార్థులకు మాక్ పోలింగ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యత, సమానత్వం, ఓటు హక్కు విలువ వంటి అంశాలతో పాటు ఎన్నికల ప్రక్రియ విధానంపై విద్యార్థులు అవగాహన పొందారు. అంతేకాకుండా పాఠశాల, కళాశాల పరిధిలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ స్థాయిలో ఎన్నికల పక్రియ నిర్వహించి ఫలితాలు విడుదల చేశారు. ఎన్నికల్లో గెలుపొందిన వారికి విద్యార్థులు సన్మానం, విజయోత్సవ కార్యక్రమ తంతు హట్టహాసంగా నిర్వహించుకున్నారు.