13 April, 2026 | 10:33 PM

మోదీ పాలనలో మరింత పేదరికం: వీ హనుమంతరావు

09-05-2024 01:50 AM

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): దేశంలోని 25 లక్షల మంది పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని ప్రధాని మోదీ చెబుతున్నదే నిజమైతే ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ. హనుమంతరావు ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదలు మరింత పేదలుగా మారారనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మోదీ పదేళ్ల పాలనలో ఏమి చేయలేదని, అందుకే రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి మోదీ అధికారంలోకి వస్తే అదానీ, అంబానీలను మరింత ధనవంతులను చేస్తారు తప్ప పేదల జీవితాల్లో మార్పు రాదన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే కుల గణన చేపడుతామని హామీ ఇచ్చారు. దేశం సమిష్టిగా ఉండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పథకం కింద కూలీల వేతనాలు రూ. 400 వరకు పెంచుతామని చెప్పారు.