29-10-2025 12:34:17 PM
దౌల్తాబాద్: మండల పరిధిలోని గొడుగుపల్లిలో పశువులకు గాలికుంటు (ఎఫ్.ఎమ్.డి) వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు మద్దెల స్వామి మాట్లాడుతూ పశువుల ఆరోగ్య రక్షణలో భాగంగా ప్రతి పశువుకూ తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని రైతులకు సూచించారు. గాలికుంటు వ్యాధి పశువుల పాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా మరణాలకు కూడా దారితీసే ప్రమాదం ఉన్నందున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది శిల్పా,తాజామాజీ సర్పంచ్ శివకుమార్, మాజీ ఉప సర్పంచ్ బాబు,యూత్ కాంగ్రెస్ నాయకులు బాలశేఖర్ రెడ్డి తో పాటు దుర్గని నర్సింలు,నరేష్,అబ్బు,రైతులు పాల్గొన్నారు.