calender_icon.png 29 October, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలర్ వైరు తగిలి చిన్నారి మృతి

29-10-2025 02:38:49 PM

రేగొండ,(విజయక్రాంతి): మండలంలోని రామన్నగూడెం తండాలో ఇంట్లో ఉన్న ఎయిర్ కూలర్ వైరు తగిలి ఓ చిన్నారి మృతి చెందింది.గ్రామానికి చెందిన బానోతు వీరు,ప్రియాంక ల కూతురు అంజలి (3) ఇంట్లో ఉన్న కూలర్ వైరు ఒకటి కరెంటు బోర్డులో ఒకటి కిందపడి ఉండడంతో ఆడుకుంటూ వెళ్లి ముట్టుకుంది.ఇంట్లో ఎవరు లేకపోవడంతో చిన్నారి విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.