calender_icon.png 29 October, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

29-10-2025 02:34:33 PM

మందమర్రి,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు అన్ని సౌకర్యాల తో కూడిన నాణ్యమైనవిద్యను అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని  కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఉప తహసిల్దార్ సంతోష్ తో కలిసి  ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు.  అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు.

విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మధ్యాహ్నం భోజనంలో పౌష్టిక ఆహారాన్ని అందిస్తుందన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని సూచించారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్యా బోధన అందిస్తుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.