calender_icon.png 29 October, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగ్దల్పూర్ లో మోంతా తుఫాన్ బీభత్సం

29-10-2025 12:32:18 PM

మరో మూడు రోజుల పాటు తుఫాన్ ప్రభావం. 

పలు చోట్ల రెడ్ అలెర్ట్. 

చర్ల/జగదల్పూర్,(విజయక్రాంతి): తుపాన్  తీర ప్రాంతలలో పెను ప్రమాదాలను  సృష్టిస్తుంది మోంతా తుఫాను ప్రభావం తో జగదల్పూర్ లోని కెకె రైల్వే లైన్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. టైడా, చిమ్డపల్లి మధ్య కొండచరియలు విరిగిపడ్డాయి. ట్రాక్‌ అడ్డంగా ఆడిన పెద్ద రాయి నిరంతర వర్షం కారణంగా, పర్వతాల నుండి నీరు ట్రాక్‌లోకి వచ్చింది. ట్రాక్‌ను క్లియర్ చేయడానికి రైల్వే ఉద్యోగులు సంఘటనా స్థలంలోనే ఉన్నారు.

జగదల్‌పూర్, విశాఖపట్నం, ఒడిశా నుంచి బయలుదేరే ఐదు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ పలుచోట్ల తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది ,మరో మూడు రోజుల పాటు భారీ తుపాన్ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముదస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది, అందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు సెలవలు ప్రకటించింది. తీర ప్రాంతాల్లో చాపలు పట్టేవారు వేటకు వెళ్లొద్దని ,ప్రజలు అప్రమత్తం గా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది.