calender_icon.png 29 October, 2025 | 4:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

29-10-2025 02:31:14 PM

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ప్రాంగణంలో సోయా కొనుగోలు కేంద్రని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం మద్నూర్ సహకార సొసైటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.సోయా ధాన్యం క్వింటాలు రూ.5,328/-ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు.కావున రైతులందరూ సోయా ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని. దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.రైతుల కష్టానికి న్యాయం చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో   సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్,మార్కెట్ కమిటీ చైర్మన్ సౌనజన్య రమేష్, , దరస్ సాయిలు,హనుమాన్ మందిర్ ఆలయ చైర్మన్ రాంపటేల్, రమేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.